హరిజన సంఘం ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల వితరణ

నవతెలంగాణ ( వేల్పూర్) ఆర్మూర్  :  మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హరిజన సంఘం వారు  25 జతల క్రీడా దుస్తులను శుక్రవారం అందజేసినారు . ఈ కార్యక్రమంలో హరిజన సంఘ సభ్యులు మంద రాజేశ్వర్   కాతం నడిపి గంగారం , మధుగుల ప్రణయ్ , మంద నడిపి గంగారం  పాల్గొని విద్యార్థులకు దుస్తులు అందజేసి వారిని దీవించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి , గణేష్,మహేందర్ రత్నయ్య, కవిత, శ్రావణ శ్రీ మరియు  ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.