నవతెలంగాణ – చిన్నకోడూరు
పేద పిల్లలకు సహాయం చేయడంలోనే ఆనందం కలుగుతుందని ఉపాధ్యాయురాలు విజయశాంతి అన్నారు. మండల పరిధి కిష్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న విజయశాంతి తన అమ్మ అమృతమ్మ జ్ఞాపకార్థకంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రాగిజావ వితరణలో భాగంగా స్టీల్ గ్లాసులు పంపిణీ చేశామని అన్నారు. పేద పిల్లలకు సహాయం చేయడం చాలా ఆనందం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముకుంద ఉపాధ్యాయులు ఎల్లం, శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.