
ఏర్గట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ చేతుల మీదుగా సోమవారం సంఘ పరిధిలోని రైతులకు సబ్సిడీపై వచ్చిన జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ…30 కేజీల జీలుగ విత్తనాల ధర 2790 ఉందని దీనిని 60 శాతం సబ్సిడీ కింద తెలంగాణ ప్రభుత్వం 1116 అందిస్తుందని తెలిపారు. జీలుగ విత్తనాల కొనుగోలు కోసం పీఏసీఎస్ కు వచ్చే రైతులు తమ వెంట తమ పట్టాపాస్ బుక్,ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చి సబ్సిడీ పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈఓ జక్కని శ్రీనివాస్,ఏఈఓ సాయి సచిన్,సంఘ సిబ్బంది సాయిబాబా,సాయి పవన్,సతీష్ గౌడ్,రైతులు పాల్గొన్నారు.