కాంగ్రెస్ అధ్వర్యంలో స్వీట్స్ పంపిణీ 

నవతెలంగాణ-బెజ్జంకి
ఏఐసీసీ జాతీయ నాయకుడు రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకుని ఏడాది కాలం ముగియడంతో గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శానగొండ శ్రావణ్ అధ్వర్యంలో స్వీట్స్ పంపిణీ చేశారు.రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర చరిత్ర సృష్టించిందని జాతీయ కో ఆర్డినేటర్ ఎండీ ఇల్తాక్ ఆనందం వ్యక్తం చేశారు.యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజిద్,రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్, మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,నాయకులు జల్ల లింగం,అమరేందర్ రెడ్డి, మహేందర్,శరత్,సోమ రామిరెడ్డి, గూడేల్లి ఐలయ్య,చిలువేరు శ్రీనివాసరెడ్డి,మంకాలి ప్రవీణ్, సందీప్,అమరెందర్ రెడ్డి,ఉపేందర్ లు పాల్గొన్నారు.