నవతెలంగాణ – కోనరావుపేట
కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో వర్షం వల్ల వురుస్తున్న పెంకుటిల్లుకు టార్పులిన్ షీట్లు (కవర్లు) అందించిన లైవ్ జిల్లా అద్యక్షులు బాణోత్ నరేష్ నాయక్ పంపిణీ చేశారు. సుమారు ఎనిమిది వేల రూపాయలతో ఐదు కుటుంబాలకు ఈరోజు కొమ్ము మణమ్మ, ఇండ్ల దేవేంద్ర, తిక్కల అన్నపూర్ణ, మాంకాళి సుమలత, కుమ్మరి దిలీప్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, వారికి సహాయం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ నాయక్, కుమ్మరి దిలీప్ కుమార్, తిక్కల రాజు, జింకా రమేష్, తదితరులు పాల్గొన్నారు.