పాఠశాలకు ఫ్యాన్లు, పరీక్ష ప్యాడ్స్‌ పంపిణీ

Distribution of fans and test pads to the school– అదర్శ పాఠశాల ఉపాద్యాయుడు నరేందర్‌
నవతెలంగాణ-మర్కుక్‌
ప్రభుత్వ పాఠశాలలలో గుణనాత్మకమై విద్య లభిస్తుందని, అనేక సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని మర్కుక్‌ ఎంఈవో ఉదయ భాస్కర్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అంగడి కిష్టాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు నాలుగు క్రామ్‌ టన్‌ సీలింగ్‌ ఫ్యాన్లు, 176 మంది విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్స్‌, పూర్వ ప్రాథమిక విద్యార్థులు 35 మంది పెన్సిల్‌లను జగదేవపూర్‌ ఆదర్శ పాఠశాల ఉపాద్యాయులు వెలుగు నరేందర్‌, ఎంఈవో, గ్రామ సర్పంచ్‌ దుద్దెడ లక్ష్మీ రాములు గౌడ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓంకార్‌ రాధ కష్ణ, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ చల్లా బాల్‌ రెడ్డిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సదుపాయాలన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కొండల్‌ రెడ్డి ,మాజీ ఛైర్మన్‌ కుమ్మరి కనకయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రామకష్ణ రెడ్డి, హరిక, వివి చిన్ని కష్ణ, విద్యార్థుల తల్లితండ్రులు, ప్రజాప్రతినిధులు , తదితరులున్నారు.