
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మొదటి జీతంతో స్కూల్ పిల్లలకు ప్యాడ్లు అందజేశారని, మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంతో కష్టపడి చదవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ ఈధులకంటి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ మెకు మధుసూదన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, నాయకులు నారాయణరెడ్డి, బాల్ రెడ్డి,దయాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, తోట వెంకటేష్, కరుణాకర్ రెడ్డి, చక్రి, ఉపేందర్, గోపికృష్ణ, హలీమ్ ,జమిల్, ఐలేష్, పోచయ్య, ఉపాధ్యాయులు నిర్మల జ్యోతి, శ్రీనివాస్ చార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.