విద్యార్థులకు పాఠ్య సామాగ్రి పంపిణీ 

Distribution of textbooks to studentsనవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిట్యాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్ పూర్వ జిల్లా గవర్నర్ తమ్మెర లక్ష్మీనరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠ్య సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలను ఆదుకునేందుకు సంస్థలు ముందుకు రావాలని, పేద విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి అధ్యక్షురాలు మాధవ పెద్ది వాణి, ఎఫ్ డబ్ల్యూసీ జిల్లా కోఆర్డినేటర్ వేలూరు శారద, జోన్ చైర్ పర్సన్ రేవూరి శ్రీదేవి, క్లబ్ కార్యదర్శి ఆమంచి రాధిక, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం రమేష్ ,చిట్యాల ఎంపీపీఎస్ ఇంచార్జ్ హెచ్ ఎం వెంకటేశ్వరావు, ఉపాధ్యాయులు హరిసింగ్, సీఆర్పీ రంగన్న తదితరులు పాల్గొన్నారు.