
మండలంలోని కమలాపూర్ పాఠశాలకు టీవీ, రిస్క్ బెంచ్ లతోపాటు విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను బుధవారం అందించారు. కమలాపూర్ యుపిఎస్ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ శ్రేణి పొందిన నలుగురు విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లలను ఏకలవ్య ఇంజనీరింగ్ వర్క్స్ బి.వి.రమన రెడ్డి అందించగా, కొందరు గ్రామస్తులు కలిసి ఒక టీవీ మరియు ప్రైమరీ పాఠశాలకు 4 డెస్క్ బెంచీలు, నోటుబుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూరవ్వ బాబు, ఉపసర్పంచ్ రమేష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవికుమార్, హన్మారెడ్డి, దాతలు వెంకటరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.