నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సోమవారం గాలికొంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేసినట్లు వెటర్నరీ డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు. పశు వైద్య సిబ్బంది మూడు బ్యాచ్లుగా ఏర్పడి గ్రామంలో సుమారు 400 పశువులకు టీకాలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ వెటర్నరీ శశికళ, భీమ్రావు, సిబ్బంది నవీన్ లక్ష్మణ్ ,సావిత్రి, గోపాల్ మిత్ర లు భాస్కర్ గౌడ్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.