ఆర్డిఓ ఆదేశాల మేరకు ఓటర్ సమాచార లేఖలు పంపిణీ

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం పరిధిలోని లతీపూర్, వెల్టూర్, తిప్పాపూర్, తిప్పాపూర్ తండా, అయ్యవారిపల్లి, అయ్యవారిపల్లి తండా గ్రామాలలో బుధవారం చేరుకొని సహాయక పోలింగ్ స్టేషన్లను సృష్టించిన ఓటర్లకు ఓటర్ సమాచార లేఖలను పంపిణీ చేయడానికి ప్రారంభించినట్లు, మండలంలో మొత్తం 12 సహాయక పోలింగ్ కేంద్రాలు సృష్టించబడ్డాయని, 3830 మంది ఉన్నచోట ఈ కార్యాలయానికి ఇన్టిమెషన్ లేఖలు అందుతాయని మండల రెవెన్యూ తహసిల్దార్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. వీరితోపాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఆదిత్య, ఆయా గ్రామ బి ఎల్ వో లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.