మండల పరిధిలోని గూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు త్రాగు నీరందించడానికి స్థానిక నూనె లక్ష్మన్ తన తండ్రి నూనె పెద్ద రాజయ్య జ్ఞాపకార్థం శుద్ధ జల యంత్రాన్ని మంగళవారం అందజేశారు. పాఠశాల బోధన సిబ్బంది, విద్యార్థులు నూనె లక్ష్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.