గ్రామీణ గ్రంథాలయానికి వితరణ అభినందనీయం

– మంగళవారం పున: ప్రారంభం కానున్న పడకల్ గ్రామీణ గ్రంథాలయం
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
గత ఐదేళ్లుగా మూతపడిన మండలం లోని పడకల్ గ్రామీణ గ్రంథాలయం ఈనెల 26 న( మంగళవారం) పున ప్రారంభం జరుగుతున్న సందర్భంగా అవసరమైన ఫర్నిచర్, పుస్తకాల కొనుగోలుకు   నిమ్మల శ్రీనివాస్  15 వేల ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గ్రామ ప్రత్యేక అధికారి అన్నారు. ఈ సందర్భంగా 5 విలువ గల పుస్తకాలతో పాటు పదివేల విలువగల 2 టేబుల్స్ 2 బీరువా రాక్స్, పది కుర్చీలు ఒక ఫ్యాను ను ,నిమ్మల శ్రీనివాస్ తరఫున లోకపురుషోత్తం, అంకం నరేష్ ,శ్రీనివాస్, బాలా గౌడ్ చేతుల మీదుగా గ్రామ కార్యదర్శి కి అందించారు. ఈ సందర్భంగా విరు మాట్లాడుతూ గ్రామీణ గ్రంథాలయం పున ప్రారంభించడం అభినందనీయమని అలాగే 15 వేలు వితరణ చేసిన నిమ్మల శ్రీనివాసు కు గ్రామ యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.