తాడిచెర్ల ప్రాథమిక పాఠశాలకు ఆర్వోవితరణ

Distribution to Tadicherla Primary Schoolనవతెలంగాణ – మల్హర్ రావు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని నిజజీవితంలో ఆచరించి చూపించిన తాడిచెర్ల ఎస్సి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గజాడి మహేష్ నిరూపించారు.మహేష్ తండ్రి  స్వర్గీయ గజాడి సడవలి జ్ఞాపకార్ధంగా 12 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహించిన పనిచేసిన పాటశాలలో విద్యార్థులకు తాగునీటి నిమిత్తం రూ.15 వేల రూపాయలు విలువగల ఆర్వో మిషన్ అందజేశారు. మహేష్ చేసిన సేవలను కొనియాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం అధ్యక్షతన విజయవంతంగా కార్యక్రమం నిర్వహించారు.అలాగే తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఐడి కార్డ్ ,బెల్ట్ కూడా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ లక్ష్మణ్ బాబు. తాడిచర్ల హైస్కూలు  ప్రధాన ఉపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు, రామారావు పల్లి ప్రధానోపాధ్యాయుడు పద్మ, రుద్రారం ఉపాధ్యాయులు సుధాకర్,అరుణ్ కుమార్, కవిత, సురేష్,విద్యార్థులు పాల్గొన్నారు.