సావిత్రిబాయి పూలే జయంతి..పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్

నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సావిత్రిబాయి పూలే 194 జయంతి నీ పురస్కరించుకొని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డిలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతన్య మూర్తి, సమాజంలో రుగ్మతలు రూపమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కొంగల వెంకట్, టి పి టి ఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ లింగం, టిపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బాదావత్ ప్రవీణ్ నాయక్, బొంపల్లి సంగయ్య, రాజయ్య, వంశీ, అశోక్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న, సిద్ధిరాములు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.