కామారెడ్డి జిల్లా ఎస్పి శ్రీమతి సి.హెచ్.సింధు శర్మ, ఐపీఎస్ ఆదేశానుసారంగా గురువారం జిల్ల పోలీస్ కార్యాలయంలో ఉదయం 11 గంటల సమయంలో జిల్లా అదనపు ఎస్పి(అడ్మిన్) కే. నరసింహ రెడ్డి ఆద్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించరు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహనియులు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ,పొరాడి ప్రాణ త్యాగం చేసి అసువులు బాసిన అమరవీరుల జ్ఞాపకార్ధం కోసం స్మరించుకొనుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నేడు వారికి 2 నిమిషాల మౌనం పాటించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహమ్మద్ అప్సర్, ఆఫీస్ సూపరింటెండెంటులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు తిరుపతయ్య, జార్జ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నవీన్ కుమార్, కృష్ణ, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.