మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో గల గ్రామ పంచాయతి కార్యాలయంలో క్రాప్ లోన్ ఫ్యామిలీ గ్రూపింగ్ డేటా సరళిని శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేయటం జరుగుతుందని, రుణ మాఫీ అందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో రైతు కుటుంబికుల వివరాలను నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రుణ మాఫీ అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పద్మ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.