నవతెలంగాణ-జైపూర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బందు పథకం పొందుతున్న రైతులతో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సమావేశమయ్యారు. జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాథమిక వ్యవసాయ సహాకర సంఘం సభ్యులతో కలిసి రైతుల అభిప్రాయాలు అడిగి తెల్సుకున్నారు. రైతు బందు పథకం అమలులో మార్పులు, చేర్పులకు సంబంధించి రైతుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన అధికారులు నివేధికలు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. రైతులతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు గుండు తిరుపతి, సభ్యులు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మార్క్‌గ్లాడ్సన్, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు సంతోషం చంద్రశేఖర్, ఏఈఓ కొమురయ్య, ఇన్స్‌పెక్టర్ శృతి, సంఘం కార్యదర్శి అర్జున్, రైతులు లక్ష్మినారాయణ, పాలమాకుల శ్రీనివాస్‌రెడ్డి, లింగారావు, పాలమాకుల లింగారెడ్డి, సంతోష్, జాడీ ఏసయ్య పాల్గొన్నారు.