విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన ఉండాలి: జిల్లా సివిల్ కోర్టు జడ్జి ఇందిరా

నవతెలంగాణ – నవాబ్ పేట
విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సివిల్ కోర్టు జడ్జి ఇందిరా అన్నారు. మంగళవారం మండల కేంద్రము లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులు శ్రీమతి ఇందిరా సీనియర్ సివిల్ జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.బాలబాలికలకు హక్కులు చట్టాల పైన పూర్తిగా అవగాహన కల్పించారు.ప్రతి విద్యార్థి చట్టాలకు లోబడి వ్యవహరించాలని సమాజానికి ఆటంకం కావద్దని అందరు మంచి విద్యార్థులుగా తయారు కావాలని చైల్డ్ లేబర్ ఆక్ట్ గురించి బాల నేరాల గురించి చట్టాల గురించి హక్కుల గురించి పూర్తిగా వివరించారు .ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగ్య నాయక్ సీనియర్ సిటిజెన్లు ఫోరం అధ్యక్షుడు చిగుళ్ళపల్లి నర్సింలు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.