నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాంపతి మానవత్వం చాటుకున్నారు. ఆదిలాబాద్ కి చెందిన ఇరిగేషన్ డి. ఈ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం భద్రాచలం లో దైవ దర్శనం చేసుకొని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం బయలుదేరారు. ఈ క్రమంలో తాడ్వాయి – పసర మధ్యలో రహదారి పై ఉన్న కోతులను తప్పించబోయి వారి వాహనం చెట్టును దికొట్టింది.ఈ ప్రమాదం లో డి. ఈ శ్రీనివాస్ తో సహా కుటుంబ సభ్యులకు గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో ఏటూరునాగారం నుండి ములుగు వెళ్తున్న పౌరసరఫరాల శాఖ ములుగు జిల్లా మేనేజర్ రాంపతి ఈ సంఘటన స్థలం వద్ద ఆగి క్షత గాత్రులను తన వాహనం లో తీసుకొని ములుగు ఆస్పత్రి కి తరలించి మానవత్వం చాటుకున్నారు. అదేవిదంగా అంబులెన్సు కి సమాచారం అందించి మరికొంతమందిని అంబులెన్సు లో ఆసుపత్రి కి చేర్చారు. గాయాల పాలైన క్షతగాత్రులను క్షేమంగా ఆస్పత్రులకు తరలించినందుకు సరఫరాల శాఖ ములుగు జిల్లా మేనేజర్ రామ్ పతికి పలువురు అభినందనలు తెలిపారు.