జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శుక్రవారం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ బాధితులు స్వీకరించారు.జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో ,జిల్లా కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన దృశ్య జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయ వెనుక ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేయాలని ఆదేశించారు. వాటి స్థానంలో పూల మొక్కలు నాటాలని తెలిపారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వివి అప్పారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, జిల్లా పరిషత్ సూపర్డెంట్లు మదన్మోహన్ రెడ్డి, శ్రీనివాసచారి, కార్యాలయ సిబ్బంది కె విజయ కుమారి, శ్రీనివాస్ , ఇతర అధికారులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు.
ప్రభుత్వ పాఠశాల పై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి.
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా విద్యా బోధన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, హెచ్ఎం లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధన విధానాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా బోధనలు ఉండాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమాజంలో మార్పు తేవాలన్న, యువత భవిష్యత్తు బాగుండాలన్న ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు చేరెలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ తప్పకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలని కలెక్టర్ తెలియజేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరుపై ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు . ఉపాధ్యాయుల రోజువారి హాజరును తనకు పంపాలని కలెక్టర్ డీఈఓ కు ఆదేశించారు. విద్యార్థులకు చదువుపై ఉన్న భయాన్ని మంచి బోధన ద్వారా పోగొట్టాలని కలెక్టర్ తెలిపారు పాఠశాలల్లో మంచిగా బోధన చేసిన ఉపాధ్యాయులకు అవార్డ్స్ మంచి ప్రోత్సాహకాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. కొత్త నైపుణ్యాలతో కూడిన విద్య ను అందించాలని, ఈ సంవత్సరంలో ఆశించిన ఫలితాలను సాధించాలని దానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా పరిశీలిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈవోలు హత్యములు కాంప్లెక్స్ హెచ్ఎంలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.