
మేడారం లో నేడు సోమవారం రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ తో కలిసి అమ్మవార్ల గద్దేల ప్రంగణలను , హరిత హోటల్ , ఆర్టీసీ బస్టాండ్ , చిలకల గుట్ట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, ప్రోటోకాల్ అధికారి రాజ్ కుమార్, స్థానిక ఎమ్మార్వో రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.