హరితహారం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

నవతెలంగాణ-తాడ్వాయి : పర్యావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి,వాతావరణం అందించుటకు రాష్ర ప్రభుత్వం   హరిత హారం  కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టిందని, వాటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ కమీషనర్ దేవేందర్ తో కలిసి కామారెడ్డి పట్టణంలోని వివిధ నర్సరీలు, రాశివనంలో పెంచుతున్న వివివిధ రకాల మొక్కలను పరిశీలించారు.  ముందుగా కామారెడ్డి స్వాగత తోరణం వద్ద మీడియన్  లో ఏర్పాటు చేసిన మొక్కలను, ఏం.బి.ఆర్. నర్సరీ, భవానినగర్ లోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను  పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రహదారుల వెంట గ్యాప్ లను గుర్తించి  4 అడుగులు పొడవున్న మొక్కలను కర్ర ఊతంతో నాటాలని, మిగతా మొక్కలను   అన్ని మునిసిపల్ వార్డులలో, పబ్లిక్ ఇన్స్టిట్యుషన్స్ లో,   తదితర ప్రాంతాలలో నాటేలా చూడాలన్నారు. నాటిన మొక్కలలో ఏవైనా  చనిపోయి ఉంటె వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు.