ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ కే. జండగే. 

నవతెలంగాణ – భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్థానిక అరోరా కళాశాలలోని కౌంటింగ్ సెంటర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ డీసీపీ రాజేష్ తో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందించాలని అడిషనల్ కలెక్టర్లకు ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు గుర్తించి వెనువెంటనే సరిచేయాలన్నారు అనుమతి లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్ సమీపంలోకి రానీయకుండా చూడాలన్నారు.