
ఎఫ్.ఎల్.సి ని పకడ్బందీగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఈ వి ఎం గోదాంలో చేపట్టిన ఎఫ్.ఎల్.సి ని నోడల్ అధికారి బి. తిల్లైవి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో చేపట్టిన ఎఫ్.ఎల్.సి ని ఈ సి ఐ నిబంధన మేరకు ఈ నెల 5 నుండి 14 వరకు పకడ్బందీగా ఈ సి ఐ ఇంజనీర్లతో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తున్నరు అని తెలిపారు. 1867 వివిఫ్యాట్స్, 2811 బి.యు లు, 1747 సి.యు లకు ఎఫ్.ఎల్.సి చేపడుతున్నట్లు ఈ కార్యక్రమ నిర్వహణకు 13 మంది ఈసీఐ ఇంజనీర్లతో పాటు 150 మంది రెవెన్యూ సిబ్బంది నియమించామని తెలిపారు. తదుపరి ఈ వి ఎం నోడల్ అధికారి తిల్లైవి మాట్లాడుతూ ఈ. సి.ఐ నిబంధనల మేరకు ఎఫ్.ఎల్.సి ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఐదు రోజుల నుండి ఎఫ్.ఎల్.సి నిర్వహించిన ఓటింగ్ యంత్రాల పరిశీలనతో పాటు ఎఫ్.ఎల్.సి నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ తో కలసి పరిశీలించి ఈ.సి.ఎల్ ఇంజనీర్ల కు పలు సూచనలు, సలహాలు చేశారు. ఆరవ రోజు వరకు 1150 వివిఫ్యాట్స్, 1432 బి యు లు, 1155 సి.యు లు ఎఫ్.ఎల్.సి చేపట్టామని కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట కృష్ణయ్య, హుజూర్ నగర్, జగదీశ్వర్ రెడ్డి, కోదాడ సూర్యనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, తహశీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.