– మహిళలపై వివక్షత చూపరాదు..
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
సమాజ సేవలో మహిళలు ముందు ఉండటం, ఓర్పు, సహనంతో కుటుంబాలను తీర్చిదిద్దుతారని మహిళలలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతిలో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిల్లాలో అదనపు కలెక్టర్లు ఇద్దరు కూడా మహిళలు కావటం చాలా అదృష్టం గా భావిస్తున్నాని, వారి సహకారంతో జిల్లాను అభివృద్ధి లో ముందుంజలో ఉంచుతాన్నని, అర్హులైన వారు చివరి వరసలో ఉన్నవారికి పథకాలు అందేలా కృషి చేస్తాన్నాని తెలిపారు. జిల్లాలో ఉన్న మహిళలు గ్రూప్ లగా ఏర్పడి, బ్యాంక్ ల ద్వారా లోన్లు తీసుకొని నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తూ మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాలకు కూడా ఎగుమతి చేయటం శుభపరిణామం అని తెలిపారు. పీఎం ఎఫ్ ఎం ఈ లో మన జిల్లాను మొదటి ర్యాంక్ లో ఉంచిన్నందుకు మహిళలందరికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల కు ఓర్పు, సహనం, సమయ స్ఫూర్తి ఎక్కువ గా ఉంటాయని,మహిళలు ఎక్కడ అయితే పూజిస్తారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదని తెలిపారు. అలాగే పని చేసే ప్రదేశాలలో మహిళలను ఎవరైనా వేధించిన, అగౌరవ పర్చిన వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటాన్నని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మహిళలు గురించి పాడిన పాటలు బాగున్నాయని వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు.
మహిళలపై వివక్షత చూపరాదు..
జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ ) బిఎస్ లత మాట్లాడుతూ మహిళలపై ఎవరు వివక్షత చూపరాదని, మన పిల్లలని తప్పటడుగులు వేయకుండా మహిళల పట్ల గౌరవంగా ఉండేలా పెంచాలని, కుటుంబ బంధాలను భాద్యతగా సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.మహిళల కు విద్య, వైద్యం, ఆస్తి, ఓటు హక్కు అనేవి సమానంగా రాజ్యాంగం ద్వారా పొందామని ఈ అవకాశం కల్పించిన అంబేద్కర్ గారిని కొనియాడారు.మహిళలు అందరు అన్ని రంగాలలో రాణించాలని అలాగే పౌష్టిక ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు.వికలాంగులకు ఒక్కొక్క స్కూటీ విలువ1,25,000 రూపాయలు గల 15 స్కూటీలను,అలాగే ఒక్కొక్క ఛార్జింగ్ బ్యాటరీ తో నడిచే త్రి వీలర్ చైర్ విలువ 80,000 రూపాయలు గల 6 త్రి వీలర్ చైర్లను, సుమారు 25 లక్షల రూపాయలు విలువ గల వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వినికిడి లోపం ఉన్న ఎనిమిది మందికి వినికిడి యంత్రాలు అందజేశారు. మాటలు రాని నలుగురు మూగ విద్యార్థులకు చదువుకొనుటకు నాలుగు సెల్ ఫోన్లు అందజేశారు.
మహిళలను శాలువలతో సన్మానించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ మహిళా దినోత్సవ సందర్భంగా అదనపు కలెక్టర్ బి ఎస్ లత, డి డబ్ల్యుఒ వెంకట రమణ, జడ్ పి డిప్యూటీ సీఈవో శిరీష, ఎస్ సి వెల్ఫర్ ఆపిసర్ లత, అలాగే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, మహిళల జడ్పిటిసి, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ ఉద్యోగులనులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, చివేముల ఎంపీపీ కుమారి, మఠంపల్లి ఎంపీపీ పార్వతి, కోదాడ ఎంపీపీ మల్లెల రాణి, పెనపహాడ్ జడ్పిటిసి అనిత, కోదాడ జడ్పిటిసి మందాలపు కృష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.