తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..

– తేజస్ నంద్ లాల్ పవార్.
నవతెలంగాణ  – సూర్యాపేట కలెక్టరేట్
తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పోషణ అభియాన్ లో భాగంగా తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళ శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమం వారి ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 7 వరకు తల్లిపాల నిర్వహిస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో ని ప్రభుత్వ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు సహకరించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రోత్సహించాలని అన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవనంతరం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిపాల ప్రాముఖ్యత పోషకాహారం మొదలైన వాటిపై వార్డ్, గ్రామ అలాగే మండల స్థాయిలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.