
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన పిసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ భారతదేశాన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఐక్యం చేయాలని భారత్ జొడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హంధాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని మతాల పేరుతో బిజెపి ప్రభుత్వం విభజిస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరూ ఒకటేనని దేశ ప్రజలు ప్రజాస్వామ్యుతంగా సంతోషంగా జీవనం గడపాలని కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభించి నేటికీ సంవత్సరం పూర్తి చేసుకుందని మాణాల మోహన్ రెడ్డి తెలియజేశారు. దేశంలోని ప్రజలందరూ మతాలకు అతీతంగా ఐక్యంగా కలిసి ఉండి సంతోషకరంగా జీవించాలన్నదే రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశమని, కాంగ్రెస్ పార్టీ కులాలకు మతలకు అతీతంగా ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ అధికారంలో ఉన్న 65 సంవత్సరాలు దేశం మతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిచిందని, కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరంలోనే దేశంలో ఎన్నడూ లేని విధంగా మత అల్లర్లు జరిగాయని, కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాహుల్ గాంధీ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మతాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా తాహిర్బీన్దాన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశంలోని ప్రజల కష్టాలను తెలుసుకున్నారని ఆ విధంగా ప్రజల వద్దకు వెల్తు వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్లారని, దేశాన్ని విభజించు పాలించు అనే విధంగా చేస్తున్న బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టే విధంగా ప్రజలను చైతన్య పరచారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన మార్గంలో నడవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, ఇర్ఫాన్ అలీ ,రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్ , రత్నాకర్, కేశ మహేష్, అబుద్వీన్ అబ్దుల్లా, అబ్దుల్ ఏజాజ్ ,యాదగిరి ,ఈసా, మహిళా కాంగ్రెస్ నాయకులు ఉషా ,విజయపాల్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కైసర్ మరియు తదితరులు పాల్గొన్నారు.