నవతెలంగాణ – కంటేశ్వర్
న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసి వేణుగోపాల్ ని మర్యాదపూర్వకంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, రత్నాకర్, రామర్తి గోపి, బొబ్బిలి రామకృష్ణ, విపుల్ గౌడ్ కలిశారు. నిజాంబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన జిల్లా నాయకులకు సూచించారు.