
– సీజర్ చేసిన ప్రతి దానికి రసీదు అందించాలి.
– జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతట పటిష్ఠ నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. జిల్లా అంతట ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ లలో గట్టి నిఘా పెంచాలని అన్నారు. బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం లో ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, అదనపు యస్.పి. నాగేశ్వరవుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు డిజిటల్ లావాదేవీలపై అలాగే బ్యాంక్ లావాదేవీలు రూ. 5 లక్షల నుండి 10 లక్షల వరకు జరిగే వాటిపై, పోస్టల్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలపై గట్టి నిఘా ఉంచాలని , ప్రతిరోజు నివేదికను అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎఫ్. ఎస్. టి, ఎస్. ఎస్. టి టీములు నిరంతరం చేయాలన్న నిగా లో ఉండాలన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రసీదు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ టీమ్స్ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. లిక్కర్ తో పాటు ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో నల్ల బెల్లం, బేల్టు షాపుల నిర్వహణ కట్టడి చేయాలని సూచించారు. జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న టీములు, పోలీసు, ఎక్సైజ్, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ శాఖ వారు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, ఎక్సైజ్ పర్యవేక్షకులు లక్ష్మనాయక్ ,డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, ఇన్కమ్ టాక్స్ అధికారి, డిసిఓ , లీడ్ బ్యాంకు మేనేజర్ బాపూజీ, పోస్టల్ సూపర్డెంట్ ,ఎలక్షన్ విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.