
– మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది
– సీజింగ్ వాటికి రసీదులు అందించాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చెక్ పోస్టుల్లో తనిఖీలు మరింత వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు.జిల్లా అంతట ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ లలో గట్టి నిఘా పెంచాలని తెలిపారు.అదేవిదంగా జిల్లాలో బ్యాంకర్లు డిజిటల్ లావాదేవీలు అలాగే బ్యాంక్ లావాదేవీలు రూ. 5 లక్షల నుండి 10 లక్షల వరకు జరిగే వాటిపై పర్యవేక్షించాలని తెలిపారు. పోస్టల్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలపై కూడా గట్టి నిఘా ఉంచాలని అలాగే రోజువారీ నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎఫ్. ఎస్. టి, ఎస్.ఎస్.టి టీమ్ లు నిరంతరం ముమ్మర తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రసీదులు అందజేయాలని అలాగే బాధితులు ఇబ్బందులు పడకుండా ఆధారాలు చూపితే స్వాధీనం చేరుకున్న నగదు, బంగారం అలాగే ఇతర వస్తువులు బాధితులకు అందచేయాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ టీమ్స్ అక్రమ మద్యం సిజింగ్ చేయుటకు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. లిక్కర్ తో పాటు ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో నల్ల బెల్లం, బేల్టు షాపుల నిర్వహణ కట్టడి చేయాలని సూచించారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ ,ఎక్సైజ్ శాఖ సమన్వయంతో కలసి పని చేయాలని సూచించారు.పట్టుకున్న అక్రమ నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తువులకు బాధితులు ఆధారాలు చూపితే గ్రీవెన్స్ కమిటీ పరిశీలన తదుపరి 24 గంటల లోపు అందచేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 32 బృందాలు విధుల్లో ఉన్నారని , జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉందని ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నగదు రూ.273.87 లక్షలు, మద్యం 35,373.60 లీటర్ల విలువ రూ. 141.16 లక్షలు, 42 వాహనాల విలువ రూ.23.92 లక్షలు, బంగారం, ఇతర ఆభరణాల విలువ రూ. 121.43 లక్షలు ఇతర వస్తువుల విలువ రూ. 93.51 లక్షలు మొత్తం 653.89 లక్షలు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రొల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు.