కౌలస్నాల ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఇరిగేషన్ ఎస్సీ

నవతెలంగాణ – జుక్కల్ 
           మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన కౌలస్నాల ప్రాజెక్టు కామారెడ్డి జిల్లా నీటి పారుధాల ఎస్సీ మరియు ఇరిగేషన్ అధికారులు కవలసనాల ప్రాజెక్టు సంబంధించిన కాలువలను క్షేత్రస్థాయిలో గురువారం నాడు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టు కాలువల పరిస్థితిని అంచనా వేయాలని శిథిలమైన కాలులను మరమ్మత్తుల కొరకు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికను పంపాలని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు కౌలాస్ నాలా కాలువల మరమ్మత్తులు చేయడానికి ప్రత్యేకంగా నివేదికలను తయారుచేసి సంబంధిత శాఖ అధికారులకు అందించడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.