నరసింహాలయంలో జిల్లా న్యాయమూర్తి పూజలు

– పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది
– ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి శుక్రవారం సందర్శించారు. న్యాయమూర్తి సాయి రమాదేవికి ఆలయ సిబ్బంది,ఆలయ అభివృద్ధి పాలక వర్గం సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం గావించారు. న్యాయమూర్తిని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జెల్లా ప్రభాకర్ శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.