కూడవెల్లిని సందర్శించిన జిల్లా జడ్జి..

District Judge who visited Kudavelli..నవతెలంగాణ – దుబ్బాక
అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లిలోని కూడవెల్లి రామలింగేశ్వరాలయాన్ని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి గురువారం సందర్శించారు. మాఘ అమావాస్య జాతర సందర్భంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సాయి రమాదేవిని ఆలయ కమిటీ సభ్యులు ఉషయ్యగారి రాజిరెడ్డి, పుద్దోజి ప్రభాకర్ చారి, వేల్పుల యాదయ్య, కమటం లత మల్లేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు సంకేత్ శర్మ పలువురున్నారు.