సీపీఐ(ఎం) పార్టీ కి ఐలయ్య జీవితం అంకితం: జిల్లా నాయకులు పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
కొత్తగూడెం ప్రాంతంలో సీపీఐ(ఎం) విస్తరణకు కాసాని ఐలయ్య ఎనలేని కృషి చేసారని,కుటుంబసమేతంగా పార్టీ అంకితం అయి పార్టీ ఎదుగుదలకు పనిచేసిన ఆయన జీవితాన్నే అంకితం చేసిన ఆదర్శ మార్క్సిస్టు చరితార్ధుడు అయ్యారని పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఆయన సేవలను కొనియాడారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో బుధవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల కమిటీ సభ్యులు మడకం గోవిందరావు అద్యక్షతన ఐలయ్య సంతాప సభను నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ లో అయినా భార్యాభర్తలు ఇరువురు పార్టీ కి సేవలు చేయడం అరుదని,కానీ కాసాని ఐలయ్య – లక్ష్మి లు  అలాంటి అరుదైన ఘనత ను రాజకీయంగా సాధించారని అన్నారు.వారి ఇరువురు ఆశయాలను కార్యకర్తలు నేరవేర్చడమే వారికి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.