
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉపఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని నియమించిన సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అందరూ కలిసి మహేష్ కుమార్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు గురువారం తెలిపారు. వారితో పాటు పిసిసి ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హాందన్,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు అన్వేష్ రెడ్డి,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి పాల్గొన్నారు.