గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోంది తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డిచ్ పల్లి సినియర్ జర్నలిస్టు డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోకాని గంగారం ను ఇందల్ వాయి గ్రామం లోని స్వగృహంలో శుక్రవారం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, మాజీ అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య తో కలిసి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని గంగారం కు ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో జిల్లా టియుడ్లుజే జిల్లా కోశాధకారి సిరిగాద ప్రసాద్, జిల్లా నాయకులు చింతల గంగాధస్, సంజీవ్ రెడ్డి మోహన్, బిఅర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.