సంఘటన్ జాతీయ సదస్సులో పాల్గొన్న జిల్లా నాయకులు

నవతెలంగాణ-కంటేశ్వర్

రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతియ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్  ఆధ్వర్యంలో ఢిల్లీలో జవహర్ భవన్లో ఆర్ జి పి ఆర్ ఎస్ జాతీయ సదస్సు సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ , రాజ్యసభ నాయకులు ప్రమోద్ తివారి  ,ఏఐసీసీ సెక్రెటరీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి , నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, రత్నాకర్ ,రామర్తి గోపి, రామకృష్ణ బొబ్బిలి ,విపుల్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ద్వారా నేరుగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం అనేది రాజీవ్ గాంధీ  తీసుకువచ్చారని, అదే విధంగా నిధుల విషయంలో పెత్తనం అనేది అధికారుల చేతిలో కాకుండా ప్రజల చేత గెలిచిన స్థానిక సంస్థల నాయకుల ద్వారా వినియోగం ఉండాలని ఈ సదస్సులో తీర్మానించడం జరిగింది.