నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ తెలుగు మీడియం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ ను సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ నందు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సన్మానించినారు. రూరల్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, మరింత బాధ్యతతో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.