ఈనెల 22 నుంచి 24 వరకు జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడలు

– జిల్లా కలెక్టర్‌, డిఎస్‌ఎ చైర్మన్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ – ములుగు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ములుగు జిల్లాలో మండల స్థాయి సీఎం కప్‌ 2023 క్రీడా పోటీలు విజయవంతంగా ముగిసినవనీ, ఈనెల 22 నుండి24 వరకు జిల్లా స్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలు ఏటూరునాగారంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌,డిఎస్‌ఏ చైర్మన్‌ కృష్ణ ఆదిత్య శుక్రవారం తెలిపా రు. దీనిలో మండల స్థాయిలో విజేత లైన ఐదు ఈవెంట్లతో పాటు అదనంగా మరొక ఆరు ఈవెంట్లు నిర్వహించబడునని, ఈ అదనపు ఈవెంట్లకు క్రీడాకారులు నేరుగా రావాల్సి ఉంటుందన్నారు. అవి బాస్కెట్బాల్‌, బ్యాట్మెంటన్‌, బాక్సింగ్‌, హ్యాండ్‌ బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌ (ఫుట్బాల్‌ ఉమెన్స్‌) కాబట్టి ములుగు జిల్లాలోని 15-36 సంవ త్సరాల లోపు క్రీడాకారులు, విద్యార్థులు, ఈ అవకాశాన్ని వినియోగించుకో వాలని కోరారు. క్రీడల్లో పాల్గొన్న వారికి పార్టిసి పేషన్‌ సర్టిఫికెట్లు, మెరిట్‌ సర్టిఫికెట్లు ఇవ్వబడునని,వీటిలో ఫస్ట్‌ ప్లేస్‌ లో గెలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు పంపబడతారనీ కలెక్టర్‌ తెలిపారు.