మండలంలోని బషీరాబాద్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక బషీరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్, ఎంపీటీసీ తోట జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహపూరిత వాతావరణంలో టోర్నమెంట్ జరిగేలా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రీడల ద్వారా యువతకు ఎన్నో రకాల లాభాలున్నాయని, క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో కూడా స్థిరపడవచ్చు అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడం ద్వారా యువత జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యం కలుగుతుందన్నారు. కాగా ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో జిల్లాలోని వివిధ మండలాల నుండి 24 జట్లు పాల్గొంటున్నట్లు బషీరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల రాజు తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభంగా జరిగిన తొలి మ్యాచ్ లో కమ్మర్ పల్లి, భీంగల్ జట్లు తెలపడగా కమ్మర్ పల్లి జట్టు విజయం సాధించింది.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బాజన్న, రంజిత్, గౌరవ సభ్యులు సంజీవ్ గౌడ్, బి.నగేష్, శ్రీనివాస్, దేవేందర్, రాజేష్, నాయకులు నారాయణ, నెల్ల రమేష్, వినోద్, అరవింద్, చైతన్య , పండు, తదతరులు పాల్గొన్నారు.