ఈనెల 10 న జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్

నవతెలంగాణ ఆర్మూర్
జాతీయ సైన్సు దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ స్కూల్ నిజామాబాద్ నందు 11 గంటలకు నిర్వహించబడును అనీ ఎస్బి ఎస్టి జిల్లా అధ్యక్షులు గుజ్జ శివ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పసుపుల రఘునాథ్ లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ మండలాలలో సెలెక్ట్ అయిన మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయి స్టాండ్ టెస్టుకు తీసుకురావాలని, జిల్లా స్థాయి భౌతిక రసాయన శాస్త్రం టెస్ట్ లో ప్రతిభ కనబరచాలని వారు కోరినారు.