గణిత శిక్షణ కార్యక్రమానికి ఎన్నికైన జిల్లా గణిత ఉపాధ్యాయులు

నవతెలంగాణ-ఆర్మూర్ ఈనెల 13వ తేదీ నుండి 17 వరకు ఐదు రోజులపాటు గుజరాత్ రాష్ట్రంలోని ఐఐటి గాంధీ నగర్ లో జరిగే సెంటర్ ఫర్ క్రియేటివ్ లర్నింగ్ జాతీయస్థాయి గణిత శిక్షణాశిబిరానికి జిల్లా నుండి జెడ్పిహెచ్ఎస్ మెంట్రాజ్పల్లి గణితోపాధ్యాయుడు టి.కృష్ణ జెడ్పిహెచ్ఎస్ మల్కాపూర్ ఎం గణిత ఉపాధ్యాయుడు ఆర్ గోపాలకృష్ణ జెడ్పిహెచ్ఎస్ కోన సముందర్ గణిత ఉపాధ్యాయుడు కే. సతీష్ రెడ్డి ఎన్నికైనరని జిల్లా విద్యాధికారి ఎన్ వి దుర్గాప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ జాతీయస్థాయి గణిత విభాగంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రం నుండి 100 మంది గణిత ఉపాధ్యాయులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారని, జిల్లా నుండి జాతీయ స్థాయి గణిత శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికైనందుకు పై ముగ్గురిని డిఈఓ ఎన్వి దుర్గాప్రసాద్ టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కాంతారావు గౌరవాధ్యక్షులు చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు.