శిక్షణ శిబిరాన్ని సందర్శించిన జిల్లా అధికారి

నవతెలంగాణ – మోర్తాడ్

మండలం తిమ్మాపూర్ లో నిర్వహిస్తున్న బాల్ బ్యాట్ మెన్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా యోజన క్రీడ అభివృద్ధి అధికారి ముత్తన్న మంగళవారం సందర్శించారు. జిల్లా యువజన మరియు కీడాభివృద్ధి అథారిటీ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బాల్ బాట్ బ్యాట్మెన్ వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది. శిక్షణ శిబిరంలో యువత ఎలా పాల్గొంటుందనే దానిపై జిల్లా అధికారి పాల్గొని విద్యార్థుల ఆటలను పరిశీలించారు. క్రీడలలో పాటించాల్సిన పలు విషయాలను విద్యార్థులకు సూచిస్తూ జాతీయస్థాయిలో రాణించే విధంగా పలు సూచనలు అందించారు. పలువురు విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యామ్ సందీప్ క్రీడాకారులు పాల్గొన్నారు.