నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ రేవు బ్రిడ్జి నిర్మాణ స్థలంలో అధికారులు ప్రాథమిక సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా మట్టి నమూనాలను జిల్లా పంచాయతీ శాఖ అధికారులు సేకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లైన్ రమేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపిటిసి కామెల్లి బాల్ రాజ్, కాలభైరవ స్వామి ఆలయ మాజీ అధ్యక్షుడు బెజగం సంతోష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగనిబాబా, కాంగ్రెస్ పార్టీనాయకులు సంఘని బాలయ్య, నీల రవి, ఈశ్వర్ గౌడ్, సంగని బాలయ్య,ఎండ్రాల గోపాల్, సయ్యద్ బషిర్, గడ శంకర్, నితిన్ , రైతులు తాడ్వాయి విట్టల్, తాడ్వాయి సంతోష్, పత్తి కుమార్, అభిలాష్, తదితర రైతులు పాల్గొన్నారు.