భారతీయ జనతా పార్టీ గాంధారి మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగం గా గౌరారం గ్రామంలోసమావేశాని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త కష్టపడి సభ్యత లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుందని ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రతి పౌరునికి వివరించాల్సిన కర్తవ్యం ప్రతీ కార్యకర్తపై ఉందని భవిష్యత్తు మొత్తం బీజేపీ దేనిని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడే రవీందర్ రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఇకొల్ల మధుసూదన్ రావు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ కే ప్రభాకర్, ఓబీసీ మోర్చా గాంధారి మండల అధ్యక్షుడు నామ్ దేవ్ ,గౌరవం సీనియర్ నాయకులు వంజరి శ్రీనివాస్, గౌరారం బూత్ అధ్యక్షులు B రమేష్, M రమేష్ జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.