మేదరులను ఆదుకోవాలి: జిల్లా అధ్యక్షులు దర్శనం దేవేందర్

నవతెలంగాణ – ఆర్మూర్
మేదరులను ఆదుకోవాలని మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం  పట్టణంలోని ఎం.ఆర్.గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేతేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, బీసీలకు ప్రభుత్వం అందజేసే రూ.లక్ష ఆర్థిక సహాయం పై చర్చించారు. అలాగే భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ ఇటీవలే ఎస్సైగా ఎంపిక అవడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిశారు. ఆర్మూర్ సంఘం భవన నిర్మాణానికి, అలాగే డొంకేశ్వర్ మండలంలోని నికాల్ పూర్ సంఘం భవన అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోషాద్రి, ప్రచార కార్యదర్శి దర్శనం గంగాధర్, కోశాధికారి జోరిగే బాలయ్య, సలహాదారులు సుదర్శన్, గంగాధర్, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.