చైర్మన్ అన్వేష్ రెడ్డి ని సన్మానించిన జిల్లా సెర్ఫ్ జేఏసీ నాయకులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
తెలంగాణ విత్తనాభవృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిని జిల్లా పేదరిక నిర్మూల సంస్థ లో పనిచేస్తున్నజేఏసీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఆర్మూర్ లోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అన్వేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా జేఏసీ కార్యదర్శి రవి, ఆర్మూర్ టీఎన్జీవోస్ బాధ్యులు గంగారం, సీసీ లు తిరుపతి, ప్రకాష్ పాల్గొన్నారు.