నవతెలంగాణ- తిరుమలగిరి :
ఎన్నికల సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధి పాత తిరుమలగిరి వద్ద రాష్ట్ర రహదారిపై సూర్యాపేట- యాదాద్రి జిల్లాల అంతర్ జిల్లాల సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి వాహనాల తనిఖీలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చెక్ పోస్ట్ నందు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. స్వాధీనం వివరాలను రికార్డ్ చేయాలని అన్నారు. పోలీసు తనిఖీల్లో సాధారణ ప్రయాణికుల కు, స్థానిక ప్రజల కు అసౌకర్యం కలగకుండా తనిఖీలు నిర్వహించాలి అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటికల్ టీమ్ సిబ్బందితో, ఇతర అధికారులతో సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఆదేశించారు. పౌరులు ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేలా రక్షణ కల్పించడం ముఖ్య విధి అని తెలిపినారు. తనిఖీ నిరవణ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ నాగబుషణం, తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల పోలీస్ మోడల్ అధికారి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ మహేష్, స్థానిక సర్కల్ ఇన్స్పెక్టర్ లు శివ శంకర్, మురారి, ఎస్సైలు లు ప్రవీణ్, సైదులు, ప్రసాద్, అంజి రెడ్డి, రవీందర్, సిబ్బంది ఉన్నారు.