నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని స్వచదనం.. పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వచదనం-పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కల్యాణ మండపంలో ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ఆలయ ఈ.ఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, ఆలయ పర్యవేక్షకులు హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలను పరిశీలించిన ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రుతి ఓఝా..
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓఝా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి, విద్యార్థులతో మాట్లాడారు. ఉచితంగా పంపిణీ చేసిన అన్ని పుస్తకాలు వచ్చాయా? అని విద్యార్థులను అడిగి తీశారు. ఇప్పటి వరకు ఎక్కడి వరకు సిలబస్ పూర్తి చేశారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కళాశాలలో కావాల్సిన వసతుల పై ప్రిన్సిపాల్ శరత్ కుమార్ శర్మను ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ ఆరా తీశారు. ఆమె వెంట ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.